హత్య కేసులో ఆసియా జాతీయుడికి జైలు
- January 13, 2019హై క్రిమినల్ కోర్టు 38 ఏళ్ళ ఆసియా జాతీయుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సహచరుడైన ఓ వ్యక్తిని హతమార్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఇద్దరి మధ్యా తలెత్తిన చిన్న వివాదం గొడవగా మారి, హత్యకు దారి తీసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. హత్య జరిగిన సమయంలో నిందితుడు, బాధితుడు మద్యం సేవించి వున్నారనీ, తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. నిందితుడు, బాధిత వ్యక్తిని కత్తితో పడిచి చంపాడు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారంతో విచారణ తేలికయ్యిందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు