గాల్లోనే ఢీకొన్న రెండు రష్యన్ ఫైటర్ జెట్స్
- January 18, 2019రష్యాకు చెందిన రెండు సుఖోయ్ ఫైటర్ జెట్స్ గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. జపాన్ సముద్రంపై ఎగురుతున్న సమయంలో ఈ రెండు సు-34 శిక్షణ విమానాలు ఢీకొన్నట్లు రష్యన్ మిలిటరీ వెల్లడించింది. జపాన్ సముద్ర తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉన్న పైలట్లు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక పైలట్.. సముద్రంలో ఓ తెప్పపై వెళ్తూ కనిపించాడు. అతడు తన ఎమర్జెన్సీ లైట్ ద్వారా సముద్రంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. అయితే సముద్రంలో బలమైన గాలుల కారణంగా పైలట్‌ను రక్షించే చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలోనే అతని దగ్గరికి వెళ్తామని రష్యన్ మిలిటరీ చెప్పింది. ఇతర పైలట్ల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. జెట్స్ ఏమయ్యాయన్న దానిపైనా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఫైటర్ జెట్స్‌లో ఎలాంటి మిస్సైల్స్ లేవని మాత్రం మిలిటరీ చెప్పింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల