టమోటా పన్నీర్ కూర
- January 25, 2019కావలసిన పదార్థాలు: పన్నీర్ : 200గ్రాములు, నూనె : 4 చెంచాలు, ఉల్లిపాయలు : 3, ఉప్పు : తగినంత, కారం : కొద్దిగా, ధనియాల పొడి : కొద్దిగా, పసుపు : చిటికెడు, టమోటా గుజ్జు : పావుకప్పు, క్రీమ్ : 3 చెంచాలు, కొత్తిమీర : కొంచెం
తయారు చేసే పద్ధతి :చెంచా నీళ్లలో కారం, ధనియాలపొడి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి చేసి ముం దుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక ముందుగా నీళ్లలో కలిపిన మసాలా ముద్దను వేసి కలియతిప్పి పచ్చివాసన పోయా క టమోటా గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. పది నిమిషా లయ్యాక పన్నీరు ముక్కలు చేర్చా లి. గ్రేవీలో పన్నీరు ఉడి కాక క్రీమ్ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర ను రోటీలో తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!