అమెరికాలో ఆ బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు ఎంతో ప్రయోజనం..
- February 09, 2019అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు జారీచేసే గ్రీన్ పరిమితిని ఎత్తివేయాలని చట్ట సభ సభ్యులు కాంగ్రెస్ లో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిత్వానికి పోటీపడుతున్న భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ తోపాటు, రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ లీ లు ఈ బిల్లును సెనెట్ ముందుంచారు. ఇదే బిల్లునే ప్రతినిధుల సభలో చట్ట సభ్యులు ప్రవేశ పెట్టారు.
ఇరు సభల్లోను ఈ బిల్లుకు ఎక్కువ మంది సభ్యులు మద్దతు తెలుపే అవకాశంఉంది. ఇప్పటివరకు ఒక్కోదేశానికి గరిష్టంగా ఏడు శాతం గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. దీని చిన్నదేశాల నుంచి వచ్చిన వారికి త్వరగా గ్రీన్ కార్డులు వస్తుండగా….. లక్షలాది మంది ఉన్న భారత్, చైనా దేశస్థులకు గ్రీన్ కార్డు రావడానికి దశాబ్దాల సమయం పడుతోంది. ఈ గ్రీన్ కార్డు పరిమితిబిల్లు కనుక అమలులోకి వస్తే భారతీయులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..