వెండితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకేసులో ప్రియుడు

- February 09, 2019 , by Maagulf
వెండితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకేసులో ప్రియుడు

బుల్లితెర నటి సువ్వాడ నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఝాన్సీ ఇంటికెళ్లిన పోలీసులు ఝాన్సీ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, సూర్యతేజ-ఝాన్సీ మధ్య ప్రేమ వ్యవహరంపై మరిన్ని వివరాలు సేకరించారు. ఝాన్సీ తల్లి అన్న పూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్‌ వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు. ఝాన్సీ వ్యక్తి గత ఫోన్లు లాకైపోయినందున వాటిని ఓపెన్ చేసి, అందులో వాట్సాప్ ఛాటింగ్, మెసేజ్‌లు, డిలీటైన మెసేజ్‌లను సేకరించే ప్రయత్నాల

ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యతేజనే కారణమని ఝాన్సీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో సూర్య కోసం పోలీసులు గాలిస్తున్నారు ..కుటుంబ సభ్యులు వాంగ్మూలం రికార్డ్ అయ్యిన తరువాత మరోసారి ఝాన్సీ ఇంట్లో తనికీలు చేశారు పోలీసులు..

వెండితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకేసులో ప్రియుడు సూర్యతేజనే కారణం అని ప్రాథమిక దర్యాప్తు లో వెల్లడైంది .. ఝాన్సీ తల్లి అన్నపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్‌ వాంగ్మూలాన్ని మూడు గంటలు పాటు పంజాగుట్ట పోలీసులు రికార్డ్‌ చేశారు.ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యతేజనే కారణమని ఝాన్సీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సూర్య వేధింపులు తాళలేకే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని దుర్గాప్రసాద్‌ తెలిపారు. సూర్యను పోలీసులు ఇంకా అరెస్ట్‌ చేయకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యను వెంటనే అరెస్ట్‌ చేయాలని దుర్గాప్రసాద్‌ డిమాండ్ చేశారు.

ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిన రోజు ప్రియుడు సూర్యతేజతో పదే పదే ఫోన్లో మాట్లాడినట్లు కొన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు .. దీంతో అతని మొబైల్స్ సిగ్నల్స్ ఆధారంగా సూర్య ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి … ఆత్మ హత్య కి ముందు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దాదుపు నాలుగు సార్లు 10నిమిషాల పాటు అతడితో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు … ఈ మేరకు సూర్యకు ఆమె చేసిన ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలు పోలీసులకు లభ్యమైనట్లు సమాచారం. ఇక ప్రేమ పేరుతో తమ కూతురు ని లొంగదీసుకొని మోసం చేశాడంటూ కుటుంబ సభ్యులు పోలీసులు కి వాంగ్మూలం ఇచ్చారు ..

మా చెల్లెలు ఝాన్సీ చనిపోయిన తరువాత సూర్య అక్రమ సంబంధం అంటగడుతూ తప్పించుకోవాలని చూస్తున్నాడు అంటూ tv5 తో ఆరోపించారు .. తప్పు చేయకపోతే ఎందుకు ఐదు రోజులుగా దాకున్నాడు అంటూ ఆరోపించారు .. పోలీసులు నిజానిజాలు తేల్చి నిందితుడుని తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ..అలాగే మా చెల్లికి జరిగిన అన్యాయం మరే అమ్మాయి కి జరగకుండా చూడాలని తెలిపారు .. ఇక పోలీసులు కుటుంబ సభ్యులు వాంగ్మూలం రికార్డ్ అయిన తరువాత మరోసారి ఝాన్సీ ఇంటికి వెళ్లి తనికీలు చేశారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com