14న 'జెర్సీ' ఫస్ట్ సింగిల్
- February 11, 2019నాని నటిస్తోన్న తాజా చిత్రం 'జెర్సీ'. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపింబోతున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చిందని యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం మొదటి గీతాన్ని ఈనెల 14న ప్రేమికుల రోజును పురస్కరించుకుని విడుదల చేయనున్నట్టు నాని ట్విట్టర్లో సోమవారం పేర్కొన్నారు. అదెంటోగానీ ఉన్నపాటుగా... అనే పల్లవితో సాగే ఆ గీతానికి సంబంధించి ఫొటోను కూడా ఈ సందర్భంగా విడుదల చేశాడు. ఈ పాటకి అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..