డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొననున్న 60 దేశాలు

డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొననున్న 60 దేశాలు

అబుదాబీలో జరిగే 14వ ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ (ఐడెక్స్‌ 2019), ఐదవ ఎడిషన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ (నవడెక్స్‌ 2019) కోసం వివిధ దేశాలకు చెందిన సంస్థలు సమాయత్తమవుతున్నాయి. రీజియన్‌లో ఇది అతి పెద్ద డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. గత ఎడిషన్‌లో 20 బిలియన్‌ డీల్స్‌ చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇడెక్స్‌, నవ్‌డెక్స్‌ 2019 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు అబుదాబీ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ (అడ్‌నెక్‌)లో జరుగుతాయి. సిల్వర్‌ జూబ్లీ సంవత్సరం కారణంగా ఈ ఏడాది ఎగ్జిబిషన్‌ అతి పెద్దదిగా అభివర్ణిస్తున్నారు. 60 దేశాలకు చెందిన సంస్థలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయి. మొత్తంగా 1,235 కంపెనీలు 2017 ఎగ్జిబిషన్‌లో పాల్గొనగా, ఈ ఏడాది 1,310 కంపెనీలు పాల్గొననున్నాయి.   

 

Back to Top