ఉదయాన్నే గ్లాస్ కొబ్బరి నీరు తాగితే...
- February 22, 2019కొబ్బరి నీళ్లు. ఏదో దాహం వేస్తేనో, వేడి చేసిందనో తాగుతూ ఉంటారు చాలామంది. కానీ ఈ కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్ సమయంలో కొబ్బరి నీరు తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఈ నీళ్లను తీసుకోవడం వలన శరీరంలోని వేడి తగ్గిస్తుంది.
కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించి.. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. తరచు కొబ్బరి నీరు తాగడం వలన అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం... కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఈ నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఈ నీళ్లను చర్మంపై రాసుకుంటే శరీరంపై గల పొక్కులు, ర్యాషెస్ తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లకు అంతటి ప్రాధాన్యత ఉన్నది.
కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపవుతుంది. ఉదయాన్నే గ్లాస్ కొబ్బరి నీరు తాగి చూడండి.. మీకే తేడా కనిపిస్తుంది. కొబ్బరి నీరు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. ఈ నీటిని చర్మానికి కూడా రాసుకోవచ్చును.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!