డాన్ లుక్‌లో శర్వానంద్
- March 06, 2019యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య శర్వానంద్‌కు కాలం కలిసి రావడం లేదు. ఇటీవలే పడి పడి లేచే మనస్సు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ సినిమా తరువాత శర్వా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. సినిమాను వచ్చే సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్