నువ్వుల పొడిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో లక్షణాలు
- March 14, 2019నువ్వులతో ఏ రకం ఆహారం తయారుచేసినా చాలా రుచికరంగా ఉంటుంది. అయితే నువ్వుల పొడిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో లక్షణాలున్నాయి. దీనిని రోజూ తినే ఆహారంలో కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు అంటున్నారు. నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే ఎంతో మంచిది. పరిమాణంలో చాలా చిన్నగా ఉండే నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధగుణాలున్నాయి.
వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం. ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి, జింక్, పీచుపదార్థాలు తదితర పోషకాలు అత్యధికంగా లభిస్తాయి. ఇవి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ వల్ల కలిగే నొప్పిని, వాపును తగ్గించడంలో నువ్వుల్లో ఉన్న కాపర్ సహకరిస్తుంది. ఆస్తమాను అరికట్టడంలో నువ్వుపొడిలోని మాంగనీస్ ఉపకరిస్తుంది.
గుండెపోటు, స్ట్రోక్స్‌కు దారితీసే రక్తపోటును తగ్గించడంలో నువ్వుపొడిలోని మాంగనీస్ ఉపకరిస్తుంది. కలోన్ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, మైగ్రేన్, బహిష్టు ముందు కలిగే సమస్యలను తగ్గించడంలో వీటిలోని క్యాల్షియం తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించగల గుణాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల పొడిని తరచూ తీసుకుంటే రకరకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు