దుబాయ్ పోలీస్ ఓత్ సెర్మానీ: ఆకట్టుకున్న ఇండియన్ బాలిక
- March 23, 2019భారతీయ బాలిక ఒకరు, దుబాయ్ పోలీస్ నిర్వహిస్తున్న హెమాయా స్కూల్లో ఓత్ టేకింగ్ సెర్మానీని లీడ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అరబిక్‌లో ఈ ఓత్ సెర్మానీకి ఆమె లీడ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. అరబిక్ తన మాతృ భాష కాకపోయినా, అత్యద్భుతంగా అరబ్‌లో ఆమె మాట్లాడిన తీరుకి ఆశ్చర్యపోతున్నారంతా. హెమాయా స్కూల్లో నికోల్ విద్యనభ్యసిస్తోంది. దుబాయ్ పోలీస్ అధికారి ట్విట్టర్లో ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నికోల్, ఆమె తండ్రి కన్పిస్తున్నారు. దుబాయ్ పోలీస్ ఇచ్చిన ట్రైనింగ్ చాలా అద్భుతమని వారు ఈ వీడియోలో చెప్పారు. హెమాయా స్కూల్ తనను ఎలా మార్చిందో అందులో నికోల్ వివరించడం జరిగింది. దుబాయ్ పోలీస్ - మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ది నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఈ స్కూల్‌ని నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులకు ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!