వెదర్ అప్డేట్: ఈ వారంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
- March 25, 2019యూఏఈ రెసిడెంట్స్ ఈ వారంలో భారీ వర్షాల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లుగా వుండొచ్చు. విజిబిలిటీ ఇంటర్నల్ నార్తరన్ ప్రాంతాల్లో 2000 మీటర్లకు తగ్గుతుందని ఎన్‌సిఎం వివరించింది. అరేబియన్ గల్ఫ్ సముద్రం చాలా రఫ్‌గా వుంటుంది. ఒమన్ సముద్రం కూడా రఫ్‌గా వుంటుంది. మంగళవారం కూడా ఆకాశం మేఘావృతమై వుంటుంది, అక్కడక్కడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. పలు ప్రాంతాల్లో వడగళ్ళు పడే ప్రమాదం లేకపోలేదు. ఆదివారం అబుదాబీ, అల్ అయిన్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ కువైన్, రస్ అల్ ఖైమా, ఫుజారియా ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడా ఇబ్బందులు ఏర్పడినట్లు రిపోర్ట్స్ అందుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!