'స్పిరిట్ ఆఫ్ జెర్సీ' వీడియో పాట విడుదల
- April 28, 2019హైదరాబాద్: నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నాని నటన, గౌతమ్ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. కాగా ఆదివారం చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువకథానాయకుడు రానా విచ్చేశారు. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక బృందానికి జ్ఞాపికలు అందజేసి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా 'స్పిరిట్ ఆఫ్ జెర్సీ' పూర్తి వీడియో సాంగ్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అనిరుధ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను కాలభైరవ ఆలపించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు