'బుర్రకథ' టీజర్ రిలీజ్
- May 06, 2019ఆది సాయికుమార్ కథానాయకుడిగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'బుర్రకథ' రూపొందుతోంది. మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్లు వున్న యువకుడిగా కనిపించనున్నాడని ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ఒక బ్రెయిన్ ఒకలా .. మరో బ్రెయిన్ ఒకలా పనిచేస్తూ ఉంటాయి. దాంతో ఆయన అలవాట్లలోను .. అభిరుచుల్లోను వెంటవెంటనే వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. ఈ సమస్య కారణంగా హీరో ఎలాంటి ప్రమాదంలో పడతాడు? ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఈ మధ్యలోనే కావాల్సినంత కామెడీని పండించారనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమా అయినా ఆది సాయికుమార్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!