సినీ నటి సురేఖా వాణి భర్త మృతి
- May 06, 2019నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించారు. కొంతకాలంగా సురేష్ తేజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 12 గంటలకు తుది శ్వాస విడిచారు. సురేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
సురేష్ తేజ్ గతం లో టీవీ ప్రోగ్రాంలకు డైరెక్టర్ గా పనిచేశారు. నటి సురేఖా వాణి పలు సినిమాలలో, టీవీ షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త సురేష్ తేజ, కూతురుతో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తున్నారు. సురేఖా వాణి యాంకర్‌గా ఉన్న టైంలోనే సురేష్ తేజ ఆమెకు పరిచయం అయ్యారు. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సురేష్ డైరెక్షన్లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖ యాంకరింగ్ చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు