మోటరిస్టులకు యూఏఈ పోలీస్ స్పీడ్ లిమిట్ వార్నింగ్
- May 13, 2019యూఏఈ:ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్, మోటరిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలనీ, ట్రాఫిక్ సైన్స్‌కి అనుగుణంగా వాహనాలు నడపాలని, అతి వేగంతో ప్రయాణించరాదని హెచ్చరించారు. మఘ్రిబ్ ప్రేయర్స్ ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వాహనదారుల్ని అప్రమత్తం చేశారు పోలీస్ అధికారులు. పవిత్ర రమదాన్ మాసంలో వాహనదారులు రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రయాణించేటప్పుడు వేగం తగ్గించి వాహనాలు నడపాలని కోరారు. ఫాస్టింగ్ కారణంగా నిస్సత్తువతో కొందరు వుండే అవకాశముంది గనుక, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలనీ, రోడ్డుపై నడిచేవారి విషయంలో అప్రమత్తంగా వుండాలని కోరారు పోలీసులు. వాహనాల్ని తగిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!