మహిళా పోలీస్‌పై ఇద్దరు యువతుల దాడి
- May 13, 2019
కువైట్: పెట్రోలింగ్‌లో వున్న ఓ మహిళా పోలీస్ అధికారిపై ఇద్దరు యువతులు దాడి చేశారు. ఈ క్రమంలో నిందితులు, ఆ పోలీస్ అధికారి బట్టల్ని సైతం చించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే ఘటన జరిగిన సమయంలో నిందితులు అసాధారణ పరిస్థితుల్లో వున్నారని అధికారులు అంటున్నారు. పబ్లిక్ ఆఫీసర్‌ని అవమానించడం, దాడి చేయడం, వాహనాన్ని అసాధారణ స్థితిలో నడపడం, పోలీస్ అధికారిణి బట్టలు చించి వేయడం వంటి వకేసుల్ని నిందితులపై నమోదు చేశారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలుంటాయనీ, మహిళా అధికారిణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇంటీరియర్ మినిస్ట్రీ ఆపరేషన్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ సయెగ్ చెప్పారు. చెక్ పాయింట్ వద్ద వాహనాల్ని మహిళా పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే, నిందితులు తాము ఎలాంటి దుశ్చర్యకూ పాల్పడలేదని బుకాయిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







