హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ వికటించి ఇండియన్ మహిళ మృతి
- May 13, 2019
దుబాయ్‌లోని 'బెట్టీస్ కేక్ టేల్స్'లో చెఫ్‌గా పనిచేస్తున్న బెట్టీ రీటా ఫెర్నాండెజ్ అనే భారతీయ మహిళ ఇటీవల హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోగా, కొద్ది రోజులకే కాంప్లికేషన్స్ తలెత్తి, ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బెట్టీకి ఇద్దరు పిల్లలున్నారు. అల్ జహ్రా హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మొహాయెమ్ అబ్దెల్‌ఘనీ మాట్లాడుతూ, సర్జరీ తర్వాతి పరిస్థితులపై ఆమెకీ, ఆమె కుటుంబ సభ్యులకీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందనీ, అల్ జహ్రా హాస్పిటల్ దుబాయ్‌లో ఆమెకు సర్జరీ నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్ అలాగే దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్‌తో కలిసి రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో వుందని దుబాయ్ హెల్త్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. గత వారం 24 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, నోస్ సర్జరీ తర్వాత కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ డేమేజ్‌తో 20 రోజులుగా కోమాలోకి వెళ్ళిపోయింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







