విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి.. 15 ఏళ్ల బాలికతో మిలియనీర్..
- May 22, 2019అతడు అమెరికాకు చెందిన మల్టీ మిలియనీర్.. సంఘంలో మంచి పేరున్న కోటీశ్వరుడు. పేదల పాలిట పెన్నిధి. సొంతంగా విమానాలు కొని, వాటిని పేదల అవసరాల నిమిత్తం ఉచితంగా ఇస్తూ ‘ఎయిర్ లైఫ్ లైన్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి కూడా అయిన 53 ఏళ్ల స్టీఫెన్ బ్రాడ్లీ మెల్ విమానం గాల్లో ఉండగా ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి 15 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేశాడు. కుమార్తెకు ప్లయింగ్ పాఠాలు నేర్పించమని ఓ తల్లి స్టీఫెన్‌ను కోరింది. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అతడి బుద్ది వక్రించింది.
తన ప్రవేట్ జెట్ విమానంలో సోమర్ సెట్ నుంచి బ్రాంస్టేబుల్ వరకు ప్రయాణించిన స్టీఫెన్ తిరుగు ప్రయాణంలో విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి శృంగారంలో మునిగిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్టీఫెన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరాన్ని ఒప్పుకున్న స్టీఫెన్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది. కానీ స్టీఫెన్ తరపు న్యాయవాది.. తన క్లయింట్ సంఘంలో ఎంతో మంచి పేరున్న వ్యక్తి అని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని అతన్ని క్షమించి వదిలేయమంటూ కోర్టుని అభ్యర్థిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు