ఇంగ్లండ్ బయలుదేరిన కోహ్లిసేన
- May 22, 2019
ముంబై: ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టు లండన్‌కు పయనమైంది. బుధవారం తెల్లవారుఝామున ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి కోహ్లిసేన ఇంగ్లాండ్‌కు పయనమైంది. కోహ్లి, ధోని సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫోటోలను బిసిసిఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్, హార్థిక్ పాండ్యా కూడా ఫోటోలు ట్వీట్ చేశారు.
మొదటగా జూన్5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్ తన ప్రయాణం మొదటుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లో కోహ్లిసేన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు కోహ్లి, రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా ఇది తనకు అత్యంత సవాలుతో కూడుకున్న ప్రపంచకప్ అనిపిస్తుంది.
ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వచ్చు, ఫార్మాట్ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్, దీనికి ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం అని కోహ్లి అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







