మాస్క్‌లో చిన్నారిని వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు
- June 12, 2019షార్జా:కేవలం ఏడు రోజుల వయసున్న ఓ చిన్నారి, షార్జాలోని ఓ మాస్క్‌లో లభ్యమయ్యింది. మాస్క్ ఇమామ్, చిన్నారిని గుర్తించారు. ప్రార్థనల అనంతరం చిన్నారిని గుర్తించిన ఇమామ్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.నవాజి ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే అల్ ధయిద్ హాస్పిటల్‌కి ఆ చిన్నారిని తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే వుంది. వారం రోజులపాటు ఆ చిన్నారికి వైద్య చికిత్స అందించి, ఆ తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ - షార్జా సోషల్ సర్వీస్‌కి అప్పగిస్తారు. చిన్నారి తల్లిదండ్రుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది షార్జాలో ఇది రెండో ఘటన. మూడు రోజుల చిన్నారిని అల్ షక్వా ఏరియాలో వదిలేసిన ఘటన ఈ ఏడాదిలో మొట్టమొదటిది. ఆ ఘటనలో బాలుడు కాగా, తాజా గటనలో బాలికను తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వదిలించుకునే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..