షూటింగ్లో శర్వానంద్‌కు ప్రమాదం!
- June 16, 2019యంగ్ హీరో శర్వానంద్ గాయాలపాలయ్యాడు. స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. `96` షూటింగ్లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.
ట్రైనర్స్ ఆధ్వర్యంలో శర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశాడు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు క్షేమంగానే ల్యాండ్ అయ్యాడు. అయితే ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాళ్లపై ల్యాండ్ కావాల్సిన వ్యక్తి భుజాలను మోపి ల్యాండ్ అయ్యాడు. ఆ కారణంగా శర్వా భుజానికి గాయం అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. శర్వాను పరీక్షించిన డాక్టర్లు భుజానికి బలమైన గాయం తగలిందని, కాబట్టి శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం ఈ శస్త్ర చికిత్స జరగనుంది. ఆ తర్వాత కనీసం నాలుగు రోజులు హాస్పిటల్లోనే ఉండాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?