మానసిక సమస్యలను దూరం చేసే ‘మాచా’ టీ..
- July 23, 2019కాస్త ఒత్తిడిగా ఫీలైతే ఓ కప్పు కాఫీ సిప్ చేస్తాం. ఒత్తిడి తగ్గడం మాట అటుంచి కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మనసిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ అనే కథనంలో సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచా పౌడర్ని ఆందోళన, కంగారుకు గురవుతున్న ఎలుకలపై ప్రయోగించారు. ఈ పౌడర్ తీసుకున్న ఎలుకలు ఆ పరిస్థితి నుంచి బయటపడినట్లు సైంటిస్టులు గుర్తించారు. మాచాటీలో ఉంటే ఔషధ కారకాలు మన శరీరంలోని డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. అందుకే మాచా టీ తాగిన వెంటనే మనసు రిలాక్స్‌గా అనిపిస్తుందట. మానసిక సమస్యలతో బాధపడేవారు రోజూ ఓ కప్పు మాచా టీ సిప్ చేస్తే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం