లెజండరీ క్రికెటర్ బయోపిక్ నిర్మాణంలో రానా
- July 30, 2019శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్‌లో ముత్తయ్యగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నారు. థార్‌మోషన్ పిక్చర్స్‌తో సంయుక్తంగా సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర మేకర్స్ మంగళవారం ప్రకటించారు. విజయ్ సేతుపతి, దర్శకుడు రంగస్వామి, థార్ ప్రొడక్షన్‌తో కలిసి పనిచేయబోతుండడం ఉత్సాహంగా ఉందని రానా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇక సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. కాబట్టి ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ మాత్రం డిసెంబర్లో ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ