బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభం
- August 14, 2019బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయినట్లు వెల్లడించింది. ఓ విమానం నుంచి ఆయిల్ లీక్ కావడంతో, సుమారు గంటపాటు రన్ వేని మూసివేశారు సాయంత్రం 4.27 నిమిషాల సమయంలో. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఐదు విమానాల్ని దమ్మామ్ ఎయిర్పోర్ట్ వైపుకు మళ్ళించామనీ, మరొకటి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్ళించడం జరిగిందని బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ పేర్కొంది. పూర్తిగా ఆయిల్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత యధాతథంగా ఎయిర్ పోర్ట్లో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..