దుర్ముఖికి వేడుకోలు
- April 19, 2016
1. క్రొంజికురాకు బాయ సరిక్రొత్త నిగారపు చీరగట్టి అ
భ్యంజన కేశబంధమున బంధుర గంధ మనోజ్ఞమల్లికా
మంజరులన్ ధరించి వనమాల గళమ్మున దాల్చి, శ్రీలతో
రంజలజేయ వచ్చెజవరాలు యుగాది మనోహరాకృతిన్.
2. ప్రాకట వేదమంత్రములు పచ్చని రాచిలుకల్ పఠింపగా
కోకిలపిండు పాటలును, గోరలు మంగళ వాద్యనాద మీ
లోకము నిండనింపె, నతిరుచ్య వినూత్న సుభానుభూతులన్
జేకొనరారె, వీక, నిజబత్తము లొప్పుగ పల్లవింపగన్.
3. వేపపూవుల చేదు వెర్రి తలలువేయు
కామమున్ సర్వమ్ముకాల్చివైచి
గుడమునన్ గల తీపి కుప్పించి యెగసెడు
క్రోధమున్ సర్వమ్ము కూల్చివైచి
చింతలో నాంలమ్ము, చిత్తమ్మునున్ వ్రేచు
లోభమున్ సర్వమ్ములుప్తపరచి
మావిలోని వగరు, మనసులో నెలకొన్న
మోహమున్ సర్వమ్ము మ్రుచ్చిలించి
కారమును, లవణమ్ము వికారపరచు
మదము మాత్సర్యగుణముల మంటగలిపి
శాంతిజేకూర్చు "దుర్ముఖి" సార్ధకాఖ్య
వైజనుల కస్టనష్టాల బాధలిడక.
- కలవకొలను సూర్యనారాయణ
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..