మురుగదాస్ సినిమా లో అక్షయ్!
- June 10, 2016'బ్రహ్మోత్సవం' చిత్రసీమకే కాదు మహేష్‌బాబుకీ, ఆయన అభిమానులకూ గట్టి షాక్ ఇచ్చింది. అందులోంచి తేరుకోవడానికే హాలీడే ట్రిప్ వేశారు మహేష్. త్వరలోనే విదేశాల నుంచి తిరిగొస్తారు. వచ్చిన వెంటనే మురుగదాస్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఈలోగా.. మురుగదాస్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఓ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు టాక్. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈలోగా విలన్‌గా మరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్‌ని ప్రతినాయకుడి పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం 'రోబో 2'లో అక్షయ్ విలన్‌గా నటిస్తున్నాడు. మరి మహేష్ సినిమా ఓకే అంటాడో లేదో చూడాలి. ఒకవేళ అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్టుపై సంతకం చేస్తే మహేష్ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు