$500 మిలియన్ల పెట్టుబడితో గ్లోబల్ T20 లీగ్.. సౌదీ అరేబియా ప్రణాళికలు..!!

- March 17, 2025 , by Maagulf
$500 మిలియన్ల పెట్టుబడితో గ్లోబల్ T20 లీగ్.. సౌదీ అరేబియా ప్రణాళికలు..!!

రియాద్: సౌదీ అరేబియా $1 ట్రిలియన్ సావరిన్ వెల్త్ ఫండ్‌తో ప్రపంచ ట్వంటీ20 లీగ్‌ను ప్రారంభించనుంది. ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం నీల్ మాక్స్వెల్ నేతృత్వంలోని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, టెన్నిస్ గ్రాండ్ స్లామ్‌ల తరహాలో ఎనిమిది జట్ల ట్రావెలింగ్ లీగ్‌ను ప్రవేశపెట్టనుండి. సౌదీ అరేబియాకు చెందిన SRJ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా నిధులు సమకూరుతున్న ఈ లీగ్ ఏడాది పొడవునా నాలుగు వేర్వేరు ప్రదేశాలలో మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని,సౌదీ అరేబియా ఈ వెంచర్‌లో $500 మిలియన్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పురుషులు, మహిళలకు వేర్వేరుగా లీగ్ ఉండనుంది. ఫైనల్ సౌదీ అరేబియాలో జరిగే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ వంటి ప్రస్తుత T20 టోర్నమెంట్‌లను పూర్తి చేయడానికి ఉద్దేశించిన ఈ లీగ్, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో ఖాళీలను బట్టి నిర్వహించడం జరుగుతుంది.

అయితే, లీగ్‌కు ఐసిసి, క్రికెట్ ఆస్ట్రేలియా వంటి జాతీయ బోర్డుల ఆమోదం అవసరం. దాంతోపాటు ఐపీఎల్ కాని ఇతర టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు భారత ఆటగాళ్ళు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదం పొందాల్సి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com