ఏప్రిల్ నుండి వారాంతాల్లో, సెలవు దినాలలో పనిచేయనున్న బ్యాంక్ సెటిల్మెంట్ వ్యవస్థ..!!
- March 17, 2025
కువైట్: కువైట్ సెంట్రల్ బ్యాంక్..వారాంతాల్లో మరియు ఏప్రిల్ ప్రారంభం నుండి అధికారిక సెలవు దినాలలో ఆటోమేటెడ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఫర్ ఇంటర్-పార్టిసిపెంట్ పేమెంట్స్ (KASSIP), కువైట్ ఎలక్ట్రానిక్ చెక్ క్లియరింగ్ సిస్టమ్ (KECCS) లను నిర్వహించాలని స్థానిక బ్యాంకులకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంకింగ్ రంగం ఆర్థిక సేవల నాణ్యత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి CBK ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ చర్య సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. KASSIP ఉదయం 7:00 నుండి రాత్రి 11:15 వరకు బ్యాంకు ఖాతాదారుల కోసం పనిచేస్తుంది ఇంటర్‌బ్యాంక్ KECCS 24 గంటలూ పనిచేస్తుంది. KECCS కింద చెక్కు క్లియరింగ్ కోసం చివరి దరఖాస్తును సాయంత్రం 7:00 గంటలకు ముందు సమర్పించాలి. దానికి ఒక గంటలోపు సమాధానం అందుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







