సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ వీక్ ప్రారంభం..!!

- March 18, 2025 , by Maagulf
సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ వీక్ ప్రారంభం..!!

మస్కట్: బాన్ పేరుతో 28వ ఫోటోగ్రఫీ వీక్ ను మాజీ సమాచార మంత్రి డాక్టర్ అబ్దుల్మునిమ్ బిన్ మన్సూర్ అల్-హసాని ఆధ్వర్యంలో సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. విద్యార్థి వ్యవహారాల డీన్‌షిప్‌లో ఫోటో సొసైటీ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం కళాత్మక వ్యక్తీకరణ, సృజనాత్మకత వాతావరణాన్ని పెంపొందిస్తుందన్నారు.  1991లో స్థాపించబడినప్పటి నుండి విద్యార్థుల ప్రతిభను పెంపొందించడంలో ఫోటో సొసైటీ పాత్రను, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో దాని నిబద్ధతను ఆయన తెలియజేశారు.  

అల్ హసన్ అల్-యారుబి తీసిన అస్జాది ఫోటోకు మొదటి స్థానం బహుమతి లభించింది. డాక్టోరల్ విద్యార్థిని మనల్ అల్-కిండి తన ఫోటోగ్రాఫ్ ఫుధుల్‌కు రెండవ స్థానం, అల్ ఖలీల్ అల్-సక్రీ తీసిన సదీమ్ అల్-జిబాల్‌కు మూడవ బహుమతి లభించింది. 28వ ఫోటోగ్రఫీ వీక్ మార్చి 20 వరకు కొనసాగుతుందని, కళాత్మక వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు, ఇతర అనుబంధ ఈవెంట్‌లతో సహా వివిధ కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com