చట్టవిరుద్ధంగా కార్మికుల నియామకం..ఇద్దరికి 600,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: 12 మంది కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించినందుకు ఇద్దరు వ్యక్తులకు 600,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది యూఏఈ కోర్టు. ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీలలో వీరిద్దరినీ అరెస్టు చేశారు. 12 మంది కార్మికులకు 1,000 దిర్హామ్‌ల జరిమానా విధించి దేశం నుండి బహిష్కరించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గత నెలలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి 252 తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా 4,771 సంస్థలను తనిఖీ చేసినట్లు ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలి తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ కార్మికులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుల ఆధారంగా.. ఉల్లంఘించినవారికి, వారిని నియమించిన వారికి జరిమానా విధించగా, కొంతమందిని బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







