1,200కి పైగా ఆన్‌లైన్ ఫిషింగ్ కేసులు నమోదు..!!
- March 18, 2025
యూఏఈ: యూఏఈ వ్యాప్తంగా 1,200కి పైగా ఆన్‌లైన్ ఫిషింగ్ కేసులు నమోదయ్యాయని సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. ఈ కేసులు మోసపూరిత ఆన్‌లైన్, సోషల్ మీడియా విరాళాల ప్రచారాల రూపంలో ఉన్నాయన్నారు. రమదాన్ నెలలో ఈ కేసుల్లో భారీగా పెరుగుదల ఉందని, దీని వలన ప్రజలు ఫిషింగ్ దాడులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ ప్రచారాలు దాతృత్వ పనుల పేరిట దోపిడీ చేస్తాయని, వారు జకాత్ విరాళాలను సేకరిస్తున్నట్లు పేర్కొంటాయని సూచిస్తున్నారు.
సైబర్ మోసగాళ్ళు నకిలీ ఖాతాల సృష్టించి.. భావోద్వేగపూరిత ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి దోచుకుంటారని తెలిపారు.ఇందు కోసం వీరు నకిలీ వెబ్‌సైట్‌ల సృష్టితో సహా వివిధ పద్ధతులను ఉపయోగిస్తారని హెచ్చరించారు. అలాంటి వాటిని ట్రాక్ చేయడానికి అన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ అథారిటీ తెలిపింది.
ఏదైనా ఆన్‌లైన్ విరాళ అభ్యర్థనల ప్రామాణికతను ధృవీకరించుకోవాలని, విరాళాలు ఇవ్వబడిన సంస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనిటీ సభ్యులను హెచ్చరించింది. సంబంధిత అధికారులచే ధృవీకరించబడిన అధీకృత సంస్థల ద్వారా మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. విశ్వసనీయత లేని సైట్లలో క్రెడిట్ కార్డ్ నంబర్‌లను ఆన్‌లైన్‌లో ఎవరితోనూ పంచుకోకూడదని అధికార యంత్రాంగం సూచించింది. నివాసితులు వెంటనే ఆన్‌లైన్ బెగ్గింగ్, ఫ్రాడ్ లాంటి ఏవైనా అనుమానాస్పద కేసులను సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు. ఇటీవల దుబాయ్ పోలీసులు రమదాన్ మొదటి 10 రోజుల్లో 33 మంది బెగ్గర్స్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, షార్జాలో నగర పోలీసులు ఇటీవల నిర్వహించిన రియల్ టైమ్ ప్రయోగంలో ఒక వ్యక్తి బెగ్గర్ గా నటించి.. నివాసితుల భావోద్వేగాలను వాడుకొని కేవలం ఒక గంటలో Dh367 వసూలు చేయగలిగాడు. ఇది సోషల్ మీడియాలో వైరలవుతుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!







