అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే Dh3,000 జరిమానా..!!

- March 18, 2025 , by Maagulf
అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే Dh3,000 జరిమానా..!!

యూఏఈ: రహదారులపై అత్యవసర వాహనాలకు దారి ఇవ్వమని వాహనదారులను కోరుతూ అబుదాబి ఒక ప్రచారాన్ని ప్రారంభించిందని ఎమిరేట్ రవాణా అధికారం ప్రకటించింది. 'అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వడం' అనే శీర్షికతో జరిగిన అవగాహన ప్రచారం.. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి ఈ వాహనాలు ప్రమాద ప్రదేశాలకు త్వరగా చేరుకునేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

యూఏఈ చట్టం ప్రకారం.. అంబులెన్స్,పోలీసు వాహనాలకు దారి ఇవ్వని వారికి Dh3,000 జరిమానా విధించబడుతుంది. నేరం చేసే డ్రైవర్లకు ఆరు ట్రాఫిక్ పాయింట్లు కూడా విధించబడతాయి. వారి వాహనాలు 30 రోజుల పాటు జప్తు చేయబడతాయని హెచ్చరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com