సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- October 12, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రవాణా జనరల్ అథారిటీ (TGA) తనిఖీలను ముమ్మరం చేసింది. అక్టోబర్ 4–10 తేదీల మధ్య చట్టాలను ఉల్లంఘించి, సరైన లైసెన్స్ లేకుండా ప్రయాణీకుల రవాణా కార్యకలాపాలలో పాల్గొన్న 606 మందిని అరెస్టు చేశారు. వారి వాహనాలను కూడా సీజ్ చేసినట్లు అథారిటీ తెలిపింది.
రవాణా రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి, సేవలలో నాణ్యత మరియు ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించే చట్టవిరుద్ధమైన పద్ధతులను అరికట్టడానికి ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది. చట్టాలను ఉల్లంఘించేవారికి SR20,000 వరకు జరిమానాతోపాటు పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాల్లో సౌదీయేతర డ్రైవర్లను బహిష్కరిస్తామని జనరల్ రవాణా అథారిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







