BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!

- October 12, 2025 , by Maagulf
BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!

మనామా: విలువ ఆధారిత పన్ను (VAT) చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యాపార సంస్థ యజమానిపై విచారణ పూర్తియింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని ఆర్థిక నేరాలు మరియు మనీ లాండరింగ్ విభాగం వ్యాట్  చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై కేసు నమోదు చేసింది. అతని వాణిజ్య సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీలపై నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూ (NBR) నుండి నివేదిక అందడంతో దర్యాప్తు జరిపినట్లు అధికారులు తెలిపారు.

సదరు వ్యాపారి BHD 52,000 కంటే ఎక్కువ వ్యాట్ ను కస్టమర్ల నుండి వసూలు చేశాడు. కానీ తప్పుడు పన్ను రిటర్న్‌లను సమర్పించి, NBRకి నిధులను చెల్లించకుండా ఫ్రాడ్ కు పాల్పడ్డాడు. 

విచారణ సమయంలో కంపెనీ యజమాని ఆరోపణలను అంగీకరించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమానితుడిని మరియు అతని కంపెనీని మొదటి హై క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 21న విచారించనున్నట్టు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com