స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- March 19, 2025
స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లోని సెయింట్ జాకోబ్‌షాల్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ 2025 బ్యాట్మింటన్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. మాజీ వలర్డ్ నంబర్-1 కిదాంబి శ్రీకాంతో శుభారంభం చేశాడు. ఈరోజు (బుధవారం) జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో తెలుగు తెజం కితాంబి శ్రీకాంత్ 23-21, 23-21 తేడాతో భారత్ కు చెందిన మరో స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ను ఓడించాడు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో శ్రీకాంత్ పైచేయి సాధించి ప్రీ-క్వార్టర్స్ లోకి అడుగుపెట్టాడు.
మరో మ్యాచ్‌లో శంకర్ సుబ్రమణియన్ 21-5, 21-16 తేడాతో డెన్మార్క్‌కు చెందిన మంగుస్ జొహన్నసెన్‌ను చిత్తుగా ఓడించాడు. మరోవైపు యువ షట్లర్ ఆయూష్ శెట్టి పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. జపనీస్ ప్లేయర్ కెంటా నిషిమోటో చేతిలో 21-15, 21-19 తేడాతో ఓటమిపాలయ్యాడు.
మహిళల సింగిల్స్‌లో ఇషారాణి బరుహా 18-21, 21-17, 22-20 తేడాతో స్టార్ షట్లర్ ఆకర్షి కశ్యప్‌పై సంచలన విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. ఇంకో మ్యాచ్‌లో అణుపమ ఉపాద్యయ 21-14, 21-13తో భారత్‌కే చెందిన అన్మోల్ ఖర్బ్‌ను ఓడించి టోర్నీలో ముందంజ వేసింది.
మహిళల డబుల్స్‌లో భారత అగ్రశ్రేణి జోడీ, 4వ సీడ్ త్రిష జాలీ-గాయత్రి గోపీచంద్ తొలి రౌండ్‌లో 21-16, 21-17 తేడాతో అలీనె ముల్లర్-కెల్లి వాన్ బుయ్‌టెన్ జంటను వరుస గేమల్లో చిత్తు చేసి ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
కాగా, స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గత స్విస్ ఓపెన్ చాంపియన్‌లలో సింధు, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ, సైనా నెహ్వాల్, పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఉన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!