మెడికవర్ హాస్పిటల్స్ లో ఉచిత డెంటల్ చెక్ అప్

- March 20, 2025 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్స్ లో ఉచిత డెంటల్ చెక్ అప్

హైదరాబాద్: ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటే ముఖ సౌందర్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది అంటున్నారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ C. శరత్ బాబు-కన్సల్టెంట్ ప్రోస్థొడాంటిస్ట్ & ఇంప్లాంటాలజిస్ట్.

ఈ సందర్భంగా ఆశ్రి సొసైటీ అనాథ పిల్లలకు ఉచిత డెంటల్ చేక్ అప్స్ మరియు వారికీ అవసరమైన వైద్య సేవలను అందించడం జరిగింది మరియు వారి సమక్షంలో కేక్ కట్ చేసి వారికీ గిఫ్ట్స్ అందించడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా K.M రాధాకృష్ణ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, అఖిల్ చంద్ర-ప్లేబాక్ సింగర్ పాల్గొన్నారు.అనంతరం ముఖ్య అతిధి రాధాకృష్ణ మాట్లాడుతూ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు.కానీ నోరు మంచిది అయితే మన ఆరోగ్యం కూడా మంచిది అవుతుంది అని అన్నారు.మాకు దేవుడు ఇచ్చిన వరం గాత్రం, మా నోటి మరియు దంతాలను ఎంత బాగా చూసుకుంటే మేము అంతగా స్వరాలను పలికించగలం అని అన్నారు.నోటి శుభ్రత బాగుంటే మన మాటల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి అని అన్నారు.

అనంతరం డాక్టర్ C.శరత్ బాబు మాట్లాడుతూ...ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు నోటి పరిశుభ్రత,నోటి ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం ఈ రోజును జరుపుకోవడం ప్రధాన ఉద్దేశ్యం.అలాగే, దీనికి సంబంధించిన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఈ రోజును జరుపుకుంటారు. ప్రపంచ జనాభాలో,90% మంది తమ జీవితకాలంలో నోటి వ్యాధులతో బాధపడుతుంటారు, వీటిలో చాలా వరకు నివారించదగినవి.కొందరికి దంతాలు, చిగుళ్లకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోరు. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని మరియు నోటి పరిశుభ్రత కోసం ఇలా చేయండి:
- దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే మీ చిగుళ్ళు కూడా వాచి రక్తం బయటకు వస్తుంది.

- ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి.ఇలా చేయడం వల్ల పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు వస్తుంది.
- మీరు మీ దంతాలు చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఆరు నెలలకు దంత పరీక్ష చేయించుకోవడం అవసరం.
- పిల్లలు చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు.ఇవి పళ్లను పాడు చేస్తాయి.
నోటి శుభ్రత బాగుంటే మన శరీరంలో ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్స్ సోకె ప్రమాదం చాలా తక్కువ అని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో సెంటర్ హెడ్ శ్రీకాంత్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com