తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ..
- March 21, 2025
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) రాత్రి తిరుమల చేరుకున్నారు.తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు
ముందుగా వారి కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి కారులో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు ఘన స్వాగతం పలికారు.
రాత్రి తిరుమలలోనే బస చేయనున్న చంద్రబాబు.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని దర్శించుకోనున్నారు.మధ్యాహ్నం అన్నప్రసాద సముదాయంలో మనవడు దేవాన్ష్ పేరు మీద ఒక రోజు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడానికి రూ.44 లక్షలు టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు.
తరువాత కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించి..అక్కడే భోజనం చేస్తారు.ఆ తర్వాత కారులో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







