మల్లారెడ్డి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల్లో విజయ్ దేవరకొండ సందడి..

- March 21, 2025 , by Maagulf
మల్లారెడ్డి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల్లో విజయ్ దేవరకొండ సందడి..

ప్రతి యేడాది  ఎంతో ఘనంగా జరిగే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యొక్క వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుక 2025గాను ఈ ఇయర్ హీరో విజయ్ దేవరకొండ  చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. సూరారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్ లో ఈ వేడుక మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో గ్రాండ్ గా  నిర్వహించారు.ఈ వేడుకకు ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛైర్మన్, డా.భద్రారెడ్డి , మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఛైర్మన్, డా. సిహెచ్ ప్రీతి రెడ్డి తో పాటు హీరో నితిన్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు హాజరై సంది విద్యార్ధులతో సందడి చేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎప్పటికప్పుడు చెబుతుంటారు పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చానని చెబుతారు.  అందులో మల్లారెడ్డికి దేశం గర్వించదగిన మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయన్నారు. కానీ అందులో అంతకన్నా ఆయనకు విద్యార్థుల ప్రేమ ఎంతో ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. మనకు ఇష్టమైన పనిని చేస్తే మనం నిజంగా ఆనందంగా ఉంటాము. అందుకే సినిమాల షూటింగ్ సమయంలో నేను హ్యాపీగా గడుపుతాను. తన  మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఇంకా ఆనందంగా చిందులేస్తానన్నారు హీరోగా  విజయ్ దేవరకొండ.

అలాగే, ఎప్పుడూ స్టూడెంట్స్ తో ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటాను. నాకు నా కాలేజ్ డేస్ జ్ఞాపకం వస్తున్నాయి.  10 యేళ్ల క్రితం 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా కాలేజీలను తిరిగి, విద్యార్థులతో మాట్లాడిన అనుభవం గుర్తుకు వస్తుందన్నారు.
లైఫ్ లో  మీరు ఇష్టపడిన వాటిని చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటారు. జీవితం లో 3 విషయాలు మనం గుర్తించాలి - ఆరోగ్యంగా ఉండటం, డబ్బు సంపాదించడం, మనం చేసే పనిని ఇష్టపడుతూ చేయడం. ఇవి జరిగితే మనం ఎల్లపుడూ ఆనందంగా ఉంటామన్నారు హీరో విజయ్ దేవరకొండ.  

ఈ వయసులో మన తల్లిదండ్రుల మాట వినడం ఎంతో ముఖ్యమన్నారు. వారు మనకు మంచి కోసమే పాటు పడతారు.  మన తల్లిదండ్రులని ఎల్లపుడు సంతోషంగా చూసుకోవడం మన మొదటి బాధ్యత అన్నారు. వారు హ్యాపీగా ఉన్నప్పుడు మనం నిజమైన విజయాన్ని సాధించినట్లే అన్నారు.

ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా డా. సిహెచ్ ప్రీతి రెడ్డి అద్భుత నృత్యం అందరినీ అలరించింది. ఆమె నృత్యం ఈ వేడుకకు మరింత సాంస్కృతిక వైభవాన్ని తెచ్చింది.మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ విద్యార్థులకు ఈ వేడుక ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com