గురునానక్ దర్బార్ గురుద్వారాలో 'సర్వమత ఇఫ్తార్'..!!

- March 21, 2025 , by Maagulf
గురునానక్ దర్బార్ గురుద్వారాలో \'సర్వమత ఇఫ్తార్\'..!!

దుబాయ్‌: పవిత్ర రమదాన్ మాసంలో జరుపుకునే 13వ వార్షిక సర్వమత ఇఫ్తార్ కార్యక్రమానికి దుబాయ్‌లోని గురునానక్ దర్బార్ గురుద్వారా వేదికైంది.  విభిన్న విశ్వాసాలు, నేపథ్యాల నుండి 275 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ, హిందూ, సిక్కు,  ముస్లిం వర్గాల ప్రతినిధులు తరలివచ్చారు.ఈ సమావేశానికి విశిష్ట అతిథులుగా దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, హెచ్‌ఇ మేజర్ జనరల్ అహ్మద్ ఖల్ఫాన్ అల్ మన్సూరి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.యూఏఈలో ఉన్న మత స్వేచ్ఛను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు.  

గురునానక్ దర్బార్ గురుద్వారా చైర్మన్ డాక్టర్ సురేందర్ సింగ్ కాంధారి మాట్లాడుతూ.. రమాదాన్, సిక్కు మతం రెండింటిలోనూ కరుణ , సేవా స్ఫూర్తిని నొక్కి చెప్పారని తెలిపారు.హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్,  హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వంతో యూఏఈలో పరమత సహనం వెల్లివిరుస్తుందన్నారు. ఇక్కడ 200 కంటే ఎక్కువ దేశాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.  
దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. పరమత సహనాన్ని ప్రోత్సహించడంలో గురుద్వారా పాత్రను ప్రశంసించారు. "రమదాన్ అంటే ఐక్యత స్ఫూర్తి సాధ్యమైనంత ఉత్తమంగా ముందుకు వచ్చే సమయం" అని ఆయన అన్నారు. "ఈ సమావేశం కరుణ, శాంతి, ఉమ్మడి మానవత్వం  విలువలను వివరిస్తుందని తెలిపారు. గురునానక్ దర్బార్ గురుద్వారాలో జరిగిన సమావేశం నేటి ప్రపంచంలో అన్ని మతాలు, సంస్కృతుల పట్ల శాంతి, ప్రేమ, గౌరవం తప్పనిసరి అనే సందేశాన్ని బలోపేతం చేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com