షార్జాలో వాటర్ ట్యాంక్‌లో పడి 28 ఏళ్ల కార్మికుడు మృతి..!!
- March 22, 2025
యూఏఈ: షార్జా అల్ మడమ్ ప్రాంతంలోని ఒక పొలంలో ఉన్న వాటర్ ట్యాంక్‌లో పడి పడి 28 ఏళ్ల ఆఫ్రికన్ కార్మికుడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల కథనం ప్రకారం.. ఒక సహోద్యోగి బాధితుడిని గుర్తించిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. షార్జా పోలీసు ఫోరెన్సిక్ ప్రయోగశాల, క్రైమ్ సీన్ యూనిట్, పెట్రోలింగ్ అధికారులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ వారు నీటిలో పడిఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. మరణానికి సంబంధించిన పరిస్థితులను నిర్ధారించడానికి సంఘటన స్థలం నుండి ఆధారాలు, వేలిముద్రలను సేకరించి, బాధితుడి సహచరులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తిని గుర్తించడానికి కొన్ని గంటల ముందు మరణించాడని, అతని శరీరం ఇప్పటికే కుళ్ళిపోవడం ప్రారంభించిందని తేలింది. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మృతదేహాన్ని షార్జా పోలీసు ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!