పిల్లలతో భిక్షాటన..యెమెన్ జాతీయుడు అరెస్ట్..!!

- March 23, 2025 , by Maagulf
పిల్లలతో భిక్షాటన..యెమెన్ జాతీయుడు అరెస్ట్..!!

రియాద్: 8మంది పిల్లలో భిక్షాటన చేయిస్తున్న యెమెన్ జాతీయుడిని రియాద్‌లో అరెస్టు చేశారు. భిక్షాటనలో ఉన్నవారిపై రియాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన ప్రత్యేక ఆపరేషన్ సందర్భంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడటం ద్వారా యెమెన్ ప్రవాసియైన వ్యక్తి మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాడని కేసు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.పిల్లలకు  అవసరమైన మానవతా సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com