బహ్రెయిన్ GDP వృద్ధి రెట్టింపు..2.8%కి చేరుకుంటుందా?

- March 23, 2025 , by Maagulf
బహ్రెయిన్ GDP వృద్ధి రెట్టింపు..2.8%కి చేరుకుంటుందా?

మనామా: ఈ సంవత్సరం బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. GDP వృద్ధి రెట్టింపు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి చమురుయేతర రంగం మరోసారి లీడ్ రోల్ పోషిస్తుందని పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా అశాంతి పరిస్థితులు ఉన్నప్పటికీ, గల్ఫ్ అంతటా మొత్తం వృద్ధి 2025లో 4 శాతానికి చేరుకుంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ (ICAEW) నివేదిక విడుదల చేసింది. ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలలో 2024లో అంచనా వేసిన వృద్ధి 1.8 శాతం కంటే తాజాగా పెరుగుదల నమోదవుతుందని పేర్కొంది.

గత సంవత్సరం నవంబర్‌లో "వేగంగా పరివర్తన చెందుతున్న ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం" అనే బ్యానర్ కింద బహ్రెయిన్ గేట్‌వే గల్ఫ్‌కు ఆతిథ్యం ఇవ్వడాన్ని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం ఆర్థిక, పర్యాటక, రియల్ ఎస్టేట్, పరిశ్రమలలో $12 బిలియన్ల విలువైన ఒప్పందాలతో ముగిసింది. ఇది చమురుకు మించి శాఖలు విస్తరించడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్నారు.

బహ్రెయిన్‌లో, చమురుయేతర ఆర్థిక వ్యవస్థ 2025లో 3.1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చమురు రంగం కోలుకుని మద్దతు ఇవ్వనుందని భావిస్తున్నారు. ఆర్థిక సేవలు, భీమా, ఆతిథ్యంలో లాభాలతో కార్మిక మార్కెట్ విస్తరించే అవకాశం ఉందన్నారు. బహ్రెయిన్ 2030 ఆర్థిక బ్లూప్రింట్ సామర్థ్యాన్ని పెంచుతుందని, ఇంధన రంగానికి ఊతం ఇస్తుందని అంచనా వేస్తున్నారు. 2025కి చమురు వృద్ధి 0.9 శాతంగా అంచనా వేశారు.  రెండు సంవత్సరాల తగ్గింపు తర్వాత ఏప్రిల్ నుండి గల్ఫ్ అంతటా చమురు ఉత్పత్తి కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం సౌదీ అరేబియా ఉత్పత్తి రోజుకు 9.3 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా.  ఇది గత సంవత్సరం 9.1 మిలియన్ల నుండి కొద్దిగా పెరిగింది. ఇది సౌదీ చమురు రంగ వృద్ధి అంచనాను 1.9 శాతానికి పెంచిందని,  ఇది మునుపటి అంచనా 1 శాతంగా ఉందని నిపుణులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com