షార్జాలో కేవలం 3 రోజుల్లోనే Dh14,000 సంపాదించిన బెగ్గర్..!!
- March 24, 2025
యూఏఈ: షార్జా పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే Dh14,000 వసూలు చేసిన ఒక భిక్షగాడిని అరెస్టు చేశారు. స్పెషల్ టాస్క్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని యాంటీ-బెగ్గింగ్ బృందం తనీఖీల్లో భాగంగా అరెస్ట్ చేసింది. రమదాన్ ప్రారంభం నుండి ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా అనేక మంది బెగ్గర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మసీదు దగ్గర భిక్షాటన చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు స్పందించారు. పోలీసు గస్తీ బృందాన్ని పంపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతను దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నాడని తేలింది. అతను కేవలం మూడు రోజుల్లో భిక్షాటన ద్వారా దిర్హామ్‌లు 14,000 సేకరించాడని స్పెషల్ టాస్క్‌ల విభాగం డైరెక్టర్, బెగ్గర్స్ ట్రాకింగ్ బృందం అధిపతి డీన్ అల్ రకన్ ఒమర్ గజల్ అల్ షంసీ తెలిపారు. బెగ్గింగ్ అనేది నేరమని, ఎవరూ వారి మాటలకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా బెగ్గర్స్ కనిపిస్తే టోల్-ఫ్రీ నంబర్ 80040 లేదా 901లోని కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా నివేదించాలని షార్జా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







