NATS సంబరాల కోసం థమన్, దేవీశ్రీ
- March 24, 2025
హైదరాబాద్: అమెరికా లో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఈ సారి నాట్స్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి ప్రముఖ సంగీత దర్శకులు థమన్‌తో పాటు దేవీశ్రీ కూడా రావడం సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఒక్క రోజు థమన్, మరో రోజు దేవిశ్రీ తమ మ్యూజిక్ షోలతో తెలుగువారిని అలరించనున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసే అతిధులతో నాట్స్ హైదరాబాద్‌లో నిర్వహించిన సెలబ్రీటీ మీట్ అండ్ గ్రీట్‌లో థమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేవీశ్రీతో పాటు తాను కూడా అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొంటున్నానని థమన్ తెలిపారు. మేమిద్దరి బ్యాక్ టూ బ్యాక్ షోలతో తెలుగు వారికి అంతులేని ఆనందాలను పంచేందుకు సిద్ధంగా ఉన్నామని థమన్ అన్నారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాట్స్ సంబరాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే తరహాలో అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారు టంపాలో నిర్వహించే సంబరాల్లో పాలుపంచుకోవాలని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. సంబరాల్లో తెలుగు ఆట, పాటలతో పాటు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు తెలుగువారిని అలరిస్తాయని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.అమెరికా సంబరాలకు వచ్చే తెలుగువారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







