కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రo..
- July 05, 2016
ఎస్ డెరైక్టర్ మణిరత్నం తాజా చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం కొన్ని ప్రాజెక్ట్‌లు అనుకున్నా అనివార్యకారణాల వల్ల అవి ఆచరణలోకి రాలేదు. దీంతో ఈ ప్రఖ్యాత దర్శకుడి చిత్రం ఇదిగో,అదిుగో ప్రారంభం అవుతోంది అంటూ ప్రచారాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆయన తాజా చిత్రం సెట్ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రాన్ని మొదలెడుతున్నారు. ఇందులో కార్తీకి జంటగా ముంబై బ్యూటీ అదితిరావును ఎంపిక చేశారు.అంతే కాదు ఈ చిత్రానికి కాట్రు వెలియిడై అనే టైటిల్‌ను కూడా మణిరత్నం ఫిక్స్ చేశారన్నది తాజా సమాచారం. ఇందులో కార్తీ విమాన పైలట్‌గా నటించనున్నట్లు తెలిసిందే. ఇందుకోసం ఆయన చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారయ్యారట. ఈ చిత్ర షూటింగ్ 8వ తేదీ నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. తొలుత పాటతో మొదలయ్యే ఈ కాట్రు వెలియిడై చిత్రం అక్కడ 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలిసింది. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, రవివర్మ చాయాగ్రహణను, వైరముత్తు పాటలను అందిస్తున్నారు. మణిరత్నం తన మెడ్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు, దీన్ని ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







