అమెరికాలో భారతీయులకు కొత్త ఇమిగ్రేషన్ సవాళ్లు

- March 25, 2025 , by Maagulf
అమెరికాలో భారతీయులకు కొత్త ఇమిగ్రేషన్ సవాళ్లు

అమెరికా: అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఇటీవలి కాలంలో కఠినమైన ఇమిగ్రేషన్ తనిఖీలను ఎదుర్కొంటు న్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ, విమానాశ్రయాల్లో అదనపు భద్రతా తనిఖీలను ఎదుర్కొంటూ, గంటల తరబడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు వచ్చాయి.
అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపే చర్యలు ముమ్మరం చేశారు. గ్రీన్ కార్డ్ కలిగి ఉన్నా, శాశ్వత నివాస హక్కు పొందామని భావించడం పొరపాటని అధికారులు స్పష్టం చేశారు.

“అమెరికాలో ఎవరు ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది” అంటూ జేడీ వాన్స్ చేసిన ప్రకటన భారత సంతతి ప్రజల్లో ఆందోళన కలిగించింది. విదేశాల్లో ఆరు నెలలకు పైగా గడిపినవారిని మరింత కఠినంగా తనిఖీ చేస్తున్నారు. అమెరికాలో తిరిగి ప్రవేశించే సమయంలో ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలు పెరిగాయి.
గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ ప్రయాణాల సమయంలో అదనపు పత్రాలు చూపించాల్సిన పరిస్థితి.
ఇమిగ్రేషన్ అధికారుల సూచనలు–ఈ పత్రాలు తప్పనిసరి
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు: గ్రీన్ కార్డ్ గడువు ముందు నుంచే రెన్యువల్ చేయించుకోవాలి.
భారతదేశం జారీ చేసిన పాస్‌పోర్ట్ తప్పనిసరి.
హెచ్-1బీ వీసాదారులకు: తాజా పే స్లిప్స్ వెంట ఉంచుకోవాలి.
కంపెనీ నుండి హైరింగ్ లెటర్ లేదా నిర్దిష్ట పత్రాలు తీసుకోవాలి.
ఎఫ్-1 విద్యార్థులకు: విద్యాసంస్థ జారీ చేసిన అధికారిక ధ్రువపత్రం ఉండాలి.
కోర్సు కొనసాగే కాలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారుల అధిక సూచనలు
ఇమిగ్రేషన్ నియమాలు కఠినతరం అవుతున్నాయి, కావున అదనపు తనిఖీలను సహనంతో ఎదుర్కోవాలి.
ప్రయాణాల ముందు అవసరమైన అన్ని పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలి. ప్రత్యేకించి పొడవాటి విదేశీ ప్రయాణాల ముందు లాయర్ సలహా తీసుకోవడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com