ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!

- October 13, 2025 , by Maagulf
ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!

మస్కట్: ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా డొమెస్టిక్ లేబర్స్ తోపాటు ఇలాంటి వృత్తులలో ఉన్నవారి సంరక్షణకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఒమన్ క్యాబినెట్ ఆమోదించిందని తెలిపింది.

యజమానులు మరియు కార్మికుల మధ్య ఈ నిబంధనలు సురక్షితమైన, స్థిరమైన మరియు మానవీయ పని వాతావరణం నెలకోల్పుతుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. గృహ కార్మికులు, పిల్లల సంరక్షకులు, ప్రైవేట్ డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, వ్యవసాయ కార్మికులు, తోటమాలి, ఆరోగ్య సహాయకులు, ప్రైవేట్ నర్సులు, వంటవారు, ఒంటె మరియు పశువుల పెంపకందారులు వంటి వృత్తులలోని కార్మికులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు.  

ముఖ్యమైన నిబంధనల ప్రకారం.. కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగించని సెలవులకు పరిహారంతో పాటు పూర్తి మొత్తాలను అందజేయాలి. నెలవారి జీతాలను డిజిటల్ పద్ధతిలో నిర్ణీత తేదీలలో చెల్లించాలి. తగిన వసతి, ఆరోగ్య సంరక్షణ మరియు సరైన భోజనాన్ని యజమానులు అందించాలి. ఒప్పందాలకు విరుద్ధంగా కార్మికులతో బలవంతంగా పని చేయించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కార్మికుల రక్షణకు ఈ నిబంధనలను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.         

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com