'ఫక్ కుర్బా' చొరవతో వందలాది మందికి విముక్తి..!!
- March 28, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసానికి ముందు ప్రారంభించబడిన మానవతా చొరవ "ఫక్ కుర్బా" 12వ ఎడిషన్ ప్రారంభమైంది. దీనికింద ఇప్పటి వరకు 999 మందిని వారి రుణాల నుండి విముక్తి చేశారు.అప్పుల భారంతో బాధపడుతున్న వారికి సాంత్వన కుదిర్చింది. ఈ వ్యక్తుల విడుదల రెండు దశల్లో పూర్తయింది.మొదటి దశలో 511 కేసులను విడుదల చేశారు. తరువాత రెండవ దశలో 488 కేసులను విడుదల చేశారు.
ఒమానీ న్యాయవాదుల సంఘం చైర్మన్ డాక్టర్ హమద్ బిన్ హమ్దాన్ అల్-రుబై మాట్లాడుతూ.. నిర్వాహకులు మరింత మంది వ్యక్తులను రుణాల నుండి విడుదల చేయించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. వివిధ సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల నుండి లభించిన గణనీయమైన మద్దతును ఆయన గుర్తించారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడిన వారందరికీ డాక్టర్ అల్-రుబై తన కృతజ్ఞతలు తెలిపారు. 2012లో ప్రారంభమైన "ఫక్ కుర్బా" చొరవ కింద ఇప్పటివరకు 7,110 మందికి పైగా వ్యక్తులు విడుదలయ్యారని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!