ఈద్ సెలవుల్లో ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తాయా?
- March 28, 2025
కువైట్: ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. MoH ప్రకారం.. వివిధ ప్రాంతాలలో 47 ఆరోగ్య కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయని, సెలవురోజుల్లో పౌరులు, నివాసితులు అవసరమైన ఆరోగ్య సేవలను పొందవచ్చని తెలిపారు. కాగా, ఇందులో కొన్ని ఆరోగ్య కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయని, మరికొన్ని ఉదయం 7:00 గంటల నుండి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ వివరించింది.
క్యాపిటల్ హెల్త్ జోన్లో సులైబిఖాట్లోని అలీ సబా అల్-సలేం సెంటర్, ఖైతాన్‌లోని అబ్దుల్‌రెహ్మాన్ అల్-జైద్ సెంటర్, గ్రెనడాలోని అబ్దుల్లా అల్-అబ్ద్ అల్-హాది సెంటర్‌తో సహా ఆరు కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయి. అడైలియాలోని హసన్ అల్-దేహానీ సెంటర్, మిష్రెఫ్‌లోని అబ్దులాజీజ్ హుస్సేన్ సెంటర్, మిర్కాబ్లోని అబ్దుల్లా అల్-ఓత్మాన్ సెంటర్ ఉదయం 7:00 గంటల నుండి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి.
హవల్లీ హెల్త్ జోన్లో ఆరు కేంద్రాలు పనిచేస్తాయి. వీటిలో రుమైథియా, సల్వా ప్రత్యేక కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయి. మిగిలిన కేంద్రాలు, వెస్ట్ సల్మియా, వెస్ట్ సల్వా, వెస్ట్ మిష్రెఫ్, బయాన్లోని మహమూద్ హాజీ హైదర్ సెంటర్ అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి.
ఫర్వానియా హెల్త్ జోన్లో సౌత్ ఫిర్దౌస్, వెస్ట్ అండలస్, అర్దియా కేంద్రాలతో సహా తొమ్మిది కేంద్రాలు పనిచేస్తాయి. ఇవి రోజంతా సేవలను అందిస్తాయి. అలాగే, ఖైతాన్, అబ్దుల్లా ముబారక్, సౌత్ అర్దియా, సౌత్ జిలీబ్ అల్-షుయౌఖ్, సబా అల్-నాజర్, అల్-రకీ కేంద్రాలు అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి.
అహ్మదీ హెల్త్ జోన్లో సెలవు దినాలలో అత్యధిక సంఖ్యలో కేంద్రాలు పనిచేస్తాయి. మొత్తం 12 కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయి. వీటిలో వెస్ట్ సబాహియా, సబా అల్-అహ్మద్ ఎ, ఫహాహీల్, వఫ్రా, అల్-ఎగైలా, మసాయెల్, అల్-జోహోర్, అహ్మదీ, ఫింటాస్, ఇండస్ట్రియల్ పోర్ట్‌లు, సౌత్ సబాహియా, అలీ సబా అల్-సలేంలోని మహిళా కేంద్రం ఉన్నాయి.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







